జలదంకి మండలం దాసరి అగ్రహారం గ్రామానికి చెందిన పూల దత్తాత్రేయ గుండె పోటుతో మరణించారు. వారి కుటుంబానికి అండగా ఉదయగిరి నియోజకవర్గ జనసేన నాయకులు, జనసేన నాయకుడు సభ్యులు బోగినేని కాశీరావు ఆదివారం రూ. 10, 000 ఆర్థిక సహకారం అందించారు. ఈ విషయాన్ని వేములపాటి అజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్ళి ఈ కుటుంబానికి అండగా నిలబడతావని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండారు సత్య నారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.