ఉదయగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతంల్లో వినాయక చవితి పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. 7వ రోజు సంధర్భంగా అదివారం రాత్రి నర్రవాడ మాజర ఉలవవారి పాళెం వద్ద వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కూరకాయలు అందంగా అలంకరించడం జరిగింది. ఈ అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నది. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.