ఉదయగిరి నియోజకవర్గం నర్రవాడ గ్రామంలో గ్రామస్తుల అవసరం కోసం గతేడాది ఉలవవారి పాళేంలో గ్రామ పంచాయతీ అధికారులు బోరు వేశారు. దీనికి చేతిపంపు ఏర్పాటు చేయడానికి పైపులు, సామన్లు తీసుకొచ్చారు. అయితే ఇప్పటివరకు చేతిపంపును ఏర్పాటు చేయలేదు. సామన్లు శిథిలావస్థకు చేరాయి. అధికారులు వెంటనే స్పందించి చేతిపంపు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.