ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వరికుంటపాడు మండలం తోటలచెరువు పల్లి గ్రామంలో గల దివంగత నేత వైయస్సార్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో వైసిపి ఇన్ ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి బుధవారం ఆ గ్రామానికి చేరుకున్నారు. ధ్వంసమైన వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇందుకు కారణమైన నిందితులను చట్టపరంగా శిక్షించాలని ఆయన కోరారు.