నెల్లూరు రూరల్ పరిధిలోని వేదాయపాలెంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న సహస్త్ర కలశాభిషేకం, మహా మృత్యుంజయ హోమాలకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు 3 లక్షల విరాళం అందించారు. ఆదివారం ఈ మేరకు నెల్లూరులోని విపిఆర్ నివాసంలో ఆలయ ఛైర్మన్ శేషగిరి రావు, కమిటీ సభ్యులకు నగదును ఆయన అనుచరులు విరాళం అందించారు.