ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారులకు ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. సిఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.