రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 7వ తేదీన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేరెంట్- టీచర్ కార్యక్రమాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం నెల్లూరు కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో కలెక్టర్ సమీక్ష చేశారు. డీఈవో బాలాజీ రావు పాల్గొన్నారు.