భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్‌గా వి. నారాయణన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చైర్మన్ ఎస్.సోమనాథ్ పదవీ కాలం సోమవారంతో ముగిసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14న నారాయణన్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. నారాయణన్ మాట్లాడుతూ, "భారత అంతరిక్ష పరిశోధనకు ఒక స్పష్టమైన దిశ ఉంది. శాస్త్రవేత్తల ప్రతిభను పూర్తిగా ఉపయోగించుకుంటాను" అని చెప్పారు.