ప్రధాన రోడ్లమీద వాహనదారులకు అడ్డంకిగా మారిన పశువులపై వాటి యజమానులు బాధ్యత వహించకపోతే కఠిన చర్యలు తప్పవని, వాటిని గోశాలకు తరలిస్తామని నగరపాలక సంస్థ వెటర్నరీ వైద్య అధికారి డాక్టర్ మదన్ మోహన్ హెచ్చరించారు. మంగళవారం స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నెల్లూరు ముత్తుకూరు రోడ్డు, ధనలక్ష్మి పురం, మద్రాస్ బస్టాండ్, బి. వి. నగర్ ప్రాంతాల్లో సంచరిస్తున్న పశువులను కల్లూరుపల్లి గోశాలకు తరలించారు.