అల్లూరు నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి. ఉమామహేశ్వరరావు గురువారం కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డిని కావలి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అల్లూరు నగర పంచాయతీలోని సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. నగర పరిధిలో ఉన్న పారిశుద్ధ్య పనులకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలందరికి సవ్యంగా తాగునీరు అందే విధంగా చూడాలన్నారు.