కావలి మునిసిపాలిటీ మెప్మా ఆధ్వర్యంలో.. శుక్రవారం సీఆర్సీ బిల్డింగ్ నందు స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన వస్తువులతో అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మెప్మా పీడీ డి. రవీంద్ర, మునిసిపల్ ఆర్వో టీఈ కాంతయ్య హాజరై ప్రారంభించారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు నన్నపనేని సుభాషిని, కార్యదర్శి జ్యోతి, కోశాధికారి మౌనిక, సీసీఎం భారతి, సీఓలు తదితరులు పాల్గొన్నారు.