కందుకూరు మండలం కొండ ముడుసు పాలెం చెరువు తలుపులు ఎత్తడంతో భారీగా రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో అటుగా వెళుతున్న కావలి బస్సు నీటిలో దిగబడింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఇటువంటి ప్రమాదం జరగలేదు. అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని, సురక్షితంగా బయటపడ్డామని సంతోషం వ్యక్తం చేశారు. నీళ్లలో నుంచి బస్సు కదలకపోవడంతో ప్రయాణికులు నడిచి గట్టు పైకి వెళ్లారు.