పత్తికొండ ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ పరిధిలో 14 మద్యం షాపులు మంజూరైనట్లు ఎస్సై కార్తీక్ సాగర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడారు. పత్తికొండ మండలానికి 5, తుగ్గలి 2, మద్దికెర 1, దేవనకొండ 3, గోనెగండ్ల మండలానికి 3 దుకాణాల చొప్పున మొత్తం 14 దుకాణాలను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలని, ఈ మొత్తం తిరిగి ఇవ్వబడదన్నారు. ప్రైవేటుగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.