నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తాటిపాడు గ్రామంలోని జగనన్న కాలనీలో రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్, మంచినీటి సమస్యలు పరిష్కరించాలని కాలనీ వాసులతో కలిసి ఐసా జిల్లా ఉపాధ్యక్షులు వేటూరి రంగస్వామి ఆధ్వర్యంలో సోమవారం స్పందన కార్యక్రమంలో ఎంపీడీవో గోపికృష్ణ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రంగస్వామి మాట్లాడుతూ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన పరిష్కారం కాకపోవడంతో స్పందన కార్యక్రమంలో ఇవ్వడం జరిగిందన్నారు.