నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నేర నివారణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి ఉంచి కార్డెన్ సర్చ్ ఆపరేషన్ ఆదివారం డోన్ లో నిర్వహించారు. నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో డోన్ డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో డోన్ టౌన్ రూరల్ ఇన్స్పెక్టర్లు సీఎం రాకేష్, ఇంతియాజ్ భాష ఆధ్వర్యంలో ఆదివారం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.