ఆళ్లగడ్డ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో బుధవారం ఆళ్లగడ్డ ఎన్నికల అధికారి మల్లికార్జున్ రెడ్డి రాజకీయ పార్టీ ప్రతినిధులతో, ఎమ్మార్వో కార్యాలయ సిబ్బందితో, పోలీసు అధికా రులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి పలు కీలక సూచనలను చేశారు. అలాగే రాజకీయ పార్టీ నాయకులు కూడా కౌంటింగ్ సందర్భంలో నిబంధనలను తప్పకుండా పాటించి కౌంటింగ్ సజావుగా సాగేలా సహకరించాలని కోరారు.