మంత్రి నారా లోకేష్ శుక్రవారం నుంచి నవంబర్ 1 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జార్జియా ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేయనున్నారు. శనివారం శాన్ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.