రైతులు విచక్షణ రహితంగా ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటను పరిశీలించి, గమనించి, చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నాగేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం
మహానంది మండలం ఆర్. ఎస్ గాజులపల్లె, గోపవరం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. సైంటిస్ట్ ముత్యాల నాయుడు మాట్లాడుతూ అరటి పంటలో సాగు యాజమాన్య పద్ధతులు, పురుగులు, తెగుళ్లు నివారణ గురించి రైతులకు తెలియజేశారు.