రబీ సీజన్ లో ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పప్పుశనగ విత్తనాలు అందజేస్తుందని సద్వినియోగం చేసుకోవాలని పత్తికొండ ఎమ్మెల్యే కేయి శ్యాంబాబు అన్నారు. గురువారం మద్దికెర మండలంలోని బురుజుల, పత్తికొండ మండలం హోసూరు గ్రామ రైతు సేవా కేంద్రంలో సబ్సిడీ పప్పుశనగ విత్తన పంపిణీని ప్రారంభించారు. మండలానికి 3, 890 క్వింటాళ్ల విత్తనాలు మంజూరయ్యాయని చెప్పారు. తహసీల్దార్ హుసేనాసాహెబ్, సర్పంచ్ లక్ష్మిదేవి పాల్గొన్నారు.