పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి సమీపంలోని హంద్రీనీవా రిజర్వాయర్ లో చేపల పెంపకానికి సంబంధించి ఈనెల 9వ తేదీన స్థానిక గ్రామ సచివాలయంలో వేలం నిర్వహిస్తున్నట్లు గాజులదిన్నె ప్రాజెక్టు అధికారి చంద్రయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి నుంచి 2025 జూన్ 30 వరకు జిల్లా కలెక్టర్ నిర్ణయించిన గుత్త మొత్తం రూ. 66, 131గా ఉందన్నారు. వేలంలో పాల్గొనే వారు ఆధార్ కార్డుతో పాటు రూ. 10వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.