కొత్తపల్లి మండలంలోనికి గాను (01)మద్యం దుకాణాన్ని 2024-26 లీస్ సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోవచ్చని ఆదివారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఎస్సై జగదీష్, ఎస్సై వీరస్వామి సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక దరఖాస్తుదారుడు ఓకే దుకాణానికి ఎన్ని అప్లికేషన్లు అయినా వేసుకోవచ్చు అన్నారు. ఒక వ్యక్తి ఎన్ని లైసెన్సులు అయిన పొందవచ్చు అని ఒక దరఖాస్తుకు రూ 2, 00, 000 చలానా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.