మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. వరుస సెలవు దినాలు ఉండటంతో రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాఘవేంద్ర కూడలి నుంచి గురు సార్వభౌమ విద్యాపీఠం వరకు రోడ్డుకు ఇరువైపులా ప్రైవేట్ వసతి గృహాల వాహనాలు నిలపడంతో పాదాచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.