ఆదోని నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే పార్థసారథి శుక్రవారం అసెంబ్లీలో చర్చించారు. ఆదోని పట్టణంలో జనరల్ ఆసుపత్రి మాదిరి ఈఎస్ఐ ఆసుపత్రిను విస్తరించాలని కోరారు. నాలుగు నియోజకవర్గాలకు ఒకటే ఏరియా ఆసుపత్రి ఉన్న కారణంగా రోగులకు సరైన సమయంలో వైద్యం అందలేకపోతున్నారని గుర్తు చేశారు. ఈఎస్ఐ ఆసుపత్రికి స్థలం ఉన్నప్పటికీ మూలన పడే దుస్థితి నెలకొందన్నారు.