జీవో నంబర్ 85 వ్యతిరేకిస్తూ సి. బెళగల్ మండలంలోని సి. బెళగల్, పోలకల్ పీహెచ్సీలలో వైద్యులు చేపట్టిన ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దశలవారీ నిరసన కార్యాక్రమంలో భాగంగా శనివారం పీహెచ్సీల్లో సాధారణ వైద్య సేవలు నిలిపివేశారు. సి. బెళగల్ పీహెచ్సీ డాక్టర్లు మాథునరెడ్డి, సునీత, పోలకల్ డాక్టర్లు హరిచంద్రుడు, శ్రావణి నల్ల బ్యాడ్జీలు ధరించి అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందించారు.