ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలం శ్రీలక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఆదివారం ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులైన శ్రీప్రహ్లాదవరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పవిత్రాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకులు వేణుగోపాలచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు ఆలయ మాడవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అందుకు ముందు పూర్ణాహుతి చేశారు.