వరద బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు రు. 23 లక్షల చెక్కును పత్తికొండ ఎమ్మెల్యే కె. ఈ. శ్యాం బాబు గురువారం అందజేశారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు తిక్కారెడ్డి, పత్తికొండ నియోజకవర్గం టిడిపి నాయకులు పాల్గొన్నారు.