ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ బ్యాంకు సేవల్లో నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని.. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్ హితవు పలికారు. మంగళవారం పెద్దకడబూరులలోని సీపీఐ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు రుణాలు రెన్యూవల్ చేయడంలోను, కొత్త రుణాలు మంజూరు చేయడంలోను నిబంధనలు పాటించాలని, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో కీలు బొమ్మ కాకూడదని తెలిపారు.