పెద్దకడుబురు మండలం బసలదొడ్డి గ్రామ వైకాపా కార్యకర్త మల్లేష్ కుమారుడు వీరేష్(13)సం నిన్న జరిగిన రొడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం వైకాపా రాష్ట్ర యువజన నాయకులు వై ప్రదీప్ రెడ్డి మృతి చెందిన వీరేష్ కుటుంబాన్ని పరామర్శించి, తండ్రి మల్లేష్ ను ఓదార్చారు. అనంతరం మల్లేష్ కుటుంబానికి అండగా ఉంటామని హమీ ఇస్తూ.. రూ. 10వేలు ఆర్థిక సహాయంను అందజేశారు.