పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటలో దళిత మహిళ గోటిందమ్మపై దాడి చేసిన అసలైన దోషులను శిక్షించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి వినతిపత్రం అందజేసినట్లు బుధవారం తెలిపారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన వారందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.