పింఛన్ ల పంపిణీపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 1వ తేదీ సెలవు రోజు ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందించాలని నిర్ణయించింది. రెండో తేదీన మిగిలిన పంపిణీ పూర్తి చేయాలని, ఆ రోజు కుడా సెలవు ఉంటే 3వ తేదీన పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. కాగా పంపిణీ ప్రారంభించిన తొలి రోజే దాదాపు 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వం వెల్లడించింది.