విజయవాడ: సీఎం చంద్రబాబుతో ఎంపి కేశినేని శివనాథ్ భేటీ
టిడిపి కేంద్రం కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎంపి కేశినేని శివనాథ్ శనివారం కలిశారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఓల్డ్ రాజరాజేశ్వరి పేట ప్రాంతంలో రైల్వే శాఖకు చెందిన స్థలంలో నివాసం వుంటున్న నివాసితులు పదిహేను రోజుల్లోగా ఖాళీ చేయాలని రైల్వే అధికారులు చాటింపు వేయించారని, తమ ఇళ్లు కూల్చి వేసి ఖాళీ చేయిస్తారని బాధితులు అందోళన పడుతున్నారని తెలిపారు.