ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2లక్షలు విరాళం
అకాల వర్షాలు, వరదలతో అతలాకుతలమైన రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సామాజిక బాధ్యతగా విజయవాడ భావన్నారాయణ వీధిలోని తేలప్రోలు బాపనయ్య విద్యా ధర్మనిధి ట్రస్ట్ పక్షాన ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2లక్షలు విరాళం అందించింది. ఈ సందర్భంగా విరాళం చెక్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి మైలవరపు కృష్ణ తేజకు శుక్రవారం అందజేశారు.