ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై గురువారం నుండి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు మొదటి రోజు అత్యధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి భక్తుల కోసంఏర్పాటుచేసిన క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకుంటున్నారు.