తిరువూరు నియోజకవర్గం పరిధిలో గల గంపలగూడెం మండలంలోని ఊటుకూరు శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం కార్తీకమాసం సందర్భంగా మహిళలు శంఖు, చక్ర నామాల ఆకృతిలో ప్రమిదలు పేర్చి వొత్తులు వెలిగించారు. అంతకుముందు ఆకాశదీపం వెలిగించి ప్రత్యేక పూజల్లో నిర్వహించారు. ఆలయ కమిటీ, భక్తులు పాల్గొన్నారు.