తిరువూరు మండలంలోని అక్కపాలెం గ్రామం ఎస్సీ కాలనీలో వీధిలైట్లు వెలగకపోవడంతో శనివారం రాత్రి చీకటి పడిందంటే చాలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి కాలనీలో నెలకొని ఉంది. కనీస అవసరాలకు కూడా చీకటి పడిన తర్వాత బయటకు వెళ్లలేని పరిస్థితి కాలనీలో ఉంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.