ఉచిత ఇసుక విధానం వల్ల కొందరికి లాభం కలిగింది. ట్రాక్టర్ల ద్వారా బుడమేరు వాగు నుంచి ఇసుకను డంపింగ్ చేస్తూ, అర్ధరాత్రి లారీలను ఏర్పాటు చేసి, దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున మైలవరం చిన్న హరిజనవాడ సమీపంలో ఇసుకను తరలిస్తున్న లారీని సీఐ డి. చంద్రశేఖర్ సీజ్ చేశారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.