కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. బుధవారం మచిలీపట్నంలో ఎమ్మెల్సీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటరు నమోదుకు నవంబర్ ఆరో తేదీ తుది గడువు అన్నారు.