కృష్ణా మచిలీపట్నంలో సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్ద నుండి అర్జీలను జిల్లా రెవిన్యూ అధికారి కె. చంద్రశేఖర రావు, కెఆర్ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ఆర్డిఓ కె. స్వాతి స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ.. అర్జీలు అందించిన వారి సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.