రెవిన్యూ సమస్యల పరిష్కారంలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ తెలిపారు. శనివారం మచిలీపట్నం ఆర్డివోగా బాధ్యతలు స్వీకరించిన కె. స్వాతి జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూల మొక్క అందజేశారు. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు అర్జీల రూపంలో ఇచ్చిన సమస్యలను పరిష్కరించడంలో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.