మచిలీపట్నం బలరాంపేట శక్తి పటాల వద్ద జరిగిన గొడవలో మూకుమ్మడిగా దాడి చేసి ఇద్దరిని గాయపరిచిన కేసులో 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు డి. ఎస్. పి అబ్దుల్ సుభాన్ తెలిపారు. శనివారం మచిలీపట్నం ఆర్. పేట పోలీస్ స్టేషన్లో రిమాండ్కు పంపిన వాళ్లలో 14 మంది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ విద్యార్థులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. దసరా సందర్భంగా మద్యం సేవించి గొడవలు చేస్తే ఊరుకోమన్నారు.