కార్మికులకు రెగ్యులరైజేషన్, కనీస వేతనాలు, చట్టాల అమలు కోసం సెప్టెంబర్ 30న విజయవాడలో జరిగే ధర్నాలో పాల్గొనాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా నాయకులు ఎం సోమేశ్వరరావు పిలుపునిచ్చారు. జగ్గయ్యపేట పట్టణ సమీపంలోని ఆటోనగర్లో కార్మికులకు సెప్టెంబర్ 30 విజయవాడలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం కరపత్రాలు పంపిణీ చేశారు.