జగ్గయ్యపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సోమవారం పవర్ లిఫ్టింగ్ విజేతను అభినందించారు. జగ్గయ్యపేట పట్టణంలో లిటిల్ ఏంజిల్స్ స్కూల్ నందు అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలలో జగ్గయ్యపేట 15వ వార్డు చెరువు బజారునకు చెందిన శీలం గోపి పవర్ లిప్టింగ్ సీనియర్స్ బాడీ వెయిట్ 93 కేజీల విభాగంలో మొదటి బహుమతి గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకున్నాడు.