సామినేని విమల భాను ఫౌండేషన్ ఛైర్మన్, సామినేని విమల భాను ఆధ్వర్యంలో జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను సమక్షంలో జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన మహిళా నాయకులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం జనసేన పార్టీలో చేరారు. వారికి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి జగ్గయ్యపేట నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని కోరారు.