ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు, జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆదివారం విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. కూటమిలో భాగంగా విజయవాడ నగర రాజకీయాల గురించి చర్చించారు. అనంతరం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు
ఎన్ టి ఆర్ జిల్లా జనసేన అధ్యక్షులుగా నియమితులైనందుకు సామినేని ఉదయభానుకి శుభాకాంక్షలు తెలిపి శాలువతో సత్కరించారు.