ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం జగ్గయ్యపేట పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద భవన నిర్మాణ కార్మికులతో కలిసి శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ.. గత వైసిపి ప్రభుత్వంలో ఇసుక కొరత ఏర్పరిచి భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా చేసిందని అన్నారు.