జగ్గయ్యపేటలోని ఆర్టీసీ కాలనీలో శుక్రవారం బియ్యం, నూనె, దుప్పట్ల పంపిణీ చేశారు. ఆర్టీసీ కాలనీలో ఇటీవల వరదలు వచ్చిన కారణంగా అధికారుల అలసత్వంతో వరద నష్ట నమోదులో ఆలస్యం వల్ల ప్రభుత్వం నుండి నిత్యవసర సరుకులు అందలేదు. వార్డు నాయకులు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య దృష్టికి తీసుకురావడంతో స్పందించిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య సహకారంతో దాతల వితరణతో బియ్యం, నూనె, దుప్పట్లు పంపిణీ చేశారు.