గత ప్రభుత్వం దోపిడికి ప్రాధాన్యతనిస్తే కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేందుకు ప్రాధాన్యతనిస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలంలోని పలు గ్రామాలలో శనివారం నిర్వహించిన పల్లె పండగ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో రూ. 78. 78 లక్షల నిధులతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాము భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.