ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నానని, మారుమూల గ్రామాల్లో సైతం రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో శనివారం పర్యటించారు. ఎన్ఆర్జిఎస్ విధులు రూ. 42. 75 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.