ఇంద్రకీలాద్రి కొండపై దసరా ఉత్సవాలు గురువారం ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గటంతో భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లన్ని ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మూలా నక్షత్రం రోజున మాత్రమే క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసింది. మిగతా రోజులన్నీ క్యూ లైన్లో భక్తులు లేక ఖాళీగా కనబడుతున్నాయి.