వందరోజుల కూటమి ప్రభుత్వం పనితీరు బ్రహ్మాండంగా ఉందని తిరువూరు ఎమ్మెల్యే కొలికేపూడి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రాత్రి తిరువూరు పట్టణంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజా వేదిక ద్వారా ఎమ్మెల్యే విడుదల చేశారు. కూటమి శ్రేణులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.